సినిమాలో ఇకపై అలాంటి (బికినీ) దుస్తులు వేసుకోనని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ అన్నారు. 'తాజాగా: ది ఇండియా స్టోరీ' చిత్రంలో ఆమె నటించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను ఓ బిడ్డకు తల్లైన తర్వాత తన నటనకు కొన్ని పరిమితులు విధించుకున్నానని చెప్పారు. "ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఆ సినిమాలో నా పాత్ర ఎంత కీలకమైనదైనా, నా నటనకు కొన్ని హద్దులు విధించుకున్నాను. నేను నటించబోయే సినిమాల్లో మితిమీరిన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించను. అలాగే బికినీ దుస్తులు కూడా ధరించను" అని ఆమె స్పష్టం చేశారు.
Print Editionఇకపై అలాంటి దుస్తులు వేసుకోను
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 08:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)