తమిళ నటుడు పారి ఇళవళగన్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'అన్బే డయానా'. ఇందులో నటి రోజా కీలక పాత్రలో నటించారు. చిత్రాన్ని మిలియన్ డాలర్ స్టూడియోస్, నియో క్యాస్టిల్ క్రిమేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. హీరోయిన్ గా రమ్య నారాయణన్ నటించారు. ఈ సినిమా జూలై 17న విడుదల విడుదల కానుంది. ఈ క్రమంలో చెన్నైలో చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో నటి రోజా మాట్లాడుతూ.. ‘సుమారు 11 ఏళ్ల తరువాత తమిళంలో నేను నటించిన సినిమా 'లెనిన్ పాండియన్'. దాని తర్వాత ఈ చిత్రమే. దర్శకుడు పారి ఇళవళగన్ నన్ను కలిసి కథ చెప్పినప్పుడే ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందని అనిపించింది. నేను ఇందులో ఆంధ్రా నుంచి చైన్నెకి వచ్చి సెటిల్ అయిన అమ్మాయిగా నటించాను. ఇది నా నిజజీవిత పాత్రలానే ఉంది. మూవీ కోసం అందరూ బాగా కష్టపడి పనిచేశారు' అని ఆమె అన్నారు.
Print Editionనా నిజ జీవిత పాత్రలానే ఉంది : రోజా
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 07:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)