ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటిస్తోన్న సిరీస్ ‘జగమే సంగీతం’. సెప్టెంబర్ 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. సిరీస్ ట్రైలర్ మంగళవారం (ఆగస్టు 25) విడుదలైంది. దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ.. “ఈ సిరీస్‌లో అద్భుతమైన కథతో పాటు, ఆ కథకు ప్రాణం పోసే సంగీతం కూడా ఉంటుంది. ప్రేమ, ఆశలు, గుర్తింపు, జీవితం, ఫ్యామిలీ ఎమోషన్స్‌కి సంబంధించిన అంశాలన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. నటీనటులంతా ఈ కథకు ప్రాణం పోశారు. విశాల్ అందించిన సంగీతం పాత్రలన్నింటినీ కలిపే దారంగా మారింది. ప్రేక్షకులు కేవలం సంగీతంతోనే కాకుండా, ఈ పాత్రలు సాగించే భావోద్వేగ ప్రయాణంతో కూడా కదిలిపోతారని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు. కాగా, ఈ సిరీస్‌ను చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తన ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి నటించారు.
‘జగమే సంగీతం’ ట్రైలర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)