ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘జంగా’ ఫస్ట్‌లుక్‌ విడుదల

21 గంటల క్రితం

‘జంగా’ ఫస్ట్‌లుక్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

త్రిగుణ్‌, నేహా పఠాన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘జంగా’. తాజాగా చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో త్రిగుణ్‌ ‘శివ’ పాత్రలో కనిపించనున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, శ్రావణ్‌, మధునందన్‌, గగన్‌ విహారి, చందు గౌడ, సమీర్‌, రఘు కారుమంచి, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెవిన్‌ గడ్డం (శ్రీహరి) కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణ సౌరభ్‌ సంగీతం అందిస్తుండగా, వెంకట్‌ సి. దిలీప్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే సినిమా నుంచి వరుస అప్‌డేట్లు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్