గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కరికాల’ చిత్రం ప్రారంభం

8 గంటల క్రితం

'కరికాల` చిత్రం ప్రారంభం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 07:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సందీప్‌ కిషన్‌, కేథరిన్‌ థ్రెసా, గాయత్రి భరద్వాజ్‌, సాక్షి మడోల్కర్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కరికాల’ పారంభ కార్యక్రమాలు గురువారం ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్‌ తల్లి సత్యవతి కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, మహిధర్‌ తల్లి పద్మారెడ్డి క్లాప్‌ కొట్టారు. తొలి సన్నివేశానికి ఆది సాయికుమార్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రాజశేఖర్‌ తండ్రి వీరభద్రాచారి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందజేశారు. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వింటున్నంతసేపూ ఎక్కడా బోర్‌ అనిపించలేదు. నిర్మాతలు కూడా సినిమా గురించే ఆలోచిస్తున్నారు. ఇలాంటి దర్శక నిర్మాతలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ‘కరికాల’ నా కెరీర్‌లోనే మంచి చిత్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను.’’ అని అన్నారు. ‘శంబాల’ ఫేమ్‌ యుగంధర్‌ ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షైనింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై మహిధర్‌ రెడ్డి, రాజశేఖర్‌ అన్నభీమోజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది రెండు భాగాలను విడుదల చేయాలని చిత్రబృందం ప్రణాళిక రూపొందించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్