గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition డాలర్‌తో రూపాయి మరింత క్షీణత

58 నిమిషాల క్రితం

DOLLER AND RUPE
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల ప్రభావంతో రూపాయి విలువ మరింత క్షీణించింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో 95.40 వద్ద ప్రారంభమైన రూపాయి.. 95.35–95.48 మధ్య కదలాడి చివరకు 12 పైసలు నష్టపోయి డాలర్‌కు 95.45 వద్ద ముగిసింది. అమెరికా-ఇరాన్ చర్చల్లో జాప్యం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం రూపాయిపై ఒత్తిడిని కొనసాగించాయి. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గి అమెరికా-ఇరాన్ చర్చలు తిరిగి ప్రారంభమైతే, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడం రూపాయికి కొంత మద్దతు ఇవ్వొచ్చని ఫారెక్స్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు భారత్ వస్తు వాణిజ్య లోటు జులైలో 31.98 బిలియన్ డాలర్లకు పెరగడం, చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహాలు వంటి అంశాలు రూపాయిపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్