వారసుడి అన్వేషణ షురూ..
ముంబయి : టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా నిర్ణయాన్ని టాటా సన్స్‌లో 27.9 శాతం వాటా కలిగిన సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ ఆమోదించింది. తన ప్రస్తుత పదవీకాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనున్న నేపథ్యంలో తదుపరి పదవీకాలంలో తాను ఛైర్మన్‌గా కొనసాగలేనని చంద్రశేఖరన్ ఆగస్టు 12న ఈ-మెయిల్ ద్వారా టాటా సన్స్ నామినీ డైరెక్టర్లకు తెలిపారు. చంద్రశేఖరన్ రాజీనామా నేపథ్యంలో తదుపరి ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను టాటా ట్రస్ట్స్ అధికారికంగా ప్రారంభించింది. టాటా గ్రూప్ నిబంధనల ప్రకారం కొత్త ఛైర్మన్‌ను ఎంపిక చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది. దీంతో టాటా గ్రూప్ తదుపరి నాయకత్వంపై ఆసక్తి నెలకొంది.








కామెంట్‌లు (0)