హీరోహీరోయిన్లు విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటించిన తమిళ చిత్రం ‘గట్టా కుస్తీ 2’. జూలై 31 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో విడుదలైన ‘మట్టి కుస్తీ’కి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. జూలై 3న కేవలం తమిళంలోనే విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సీక్వెల్‌లో ప్రముఖ నటి రమ్యకృష్ణ, హాస్యనటుడు యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు చెల్లా ఈ సినిమాను తెరకెక్కించారు.
Print Editionఓటీటీలోకి ‘మట్టి కుస్తీ 2’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 29, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)