బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ విడుదల

4 రోజుల క్రితం

three monkeys
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 08:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెళ్ల నిర్మాణంలో దర్శకుడు కార్తీక్ గరిమెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా చిత్ర బృందం టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు జగదీష్ బుసయవలస సాహిత్యం అందించగా, చైతన్య గన్నవరపు ఆలపించారు. ఎస్. సుహాస్ సంగీతం అందిస్తున్నారు. రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్