మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాన్‌‌స్టాప్‌‌గా 24 గంటల షూటింగ్‌!

19 గంటల క్రితం

RAPO-23
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరో రామ్‌ నటుడిగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న తొలి చిత్రం #RAPO23 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ఇటీవలే చిత్ర బృందం పాండిచ్చేరికి వెళ్లింది. అక్కడ నగర శివార్లలో నాన్‌స్టాప్‌గా 24 గంటలపాటు రామ్‌ షూటింగ్‌లో పాల్గొన్నారని సమాచారం. ఒక భారీ సెట్‌లో దాదాపు తొమ్మిది రోజులపాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కురిసిన వర్షాల వల్ల షూటింగ్‌కు అంతరాయం కలిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్‌ వాయిదా పడింది. మళ్లీ త్వరలోనే చిత్ర బృందం పాండిచ్చేరికి వెళ్లనుందని సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్