యువ నటీనటులు మహేష్ దత్తా, గాయత్రి చాగంటి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓరి నాయనో’. శుక్రవారం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి క్లాప్ కొట్టగా, తొలి సన్నివేశానికి డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ఆసక్తికరమైన కథాంశాలతో రూపొందే సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతాయని, ‘ఓరి నాయనో’ కూడా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్రానికి అవసరమైన సందర్భాల్లో తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. తన హృదయానికి దగ్గరైన కథను ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నానని దర్శకుడు మణి తేజ గొంది పేర్కొన్నారు. సాయి అభిషేక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘ఓరి నాయనో’ షూటింగ్ ప్రారంభం
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 07:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)