గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రాపో-23’ నుంచి పోస్టర్ రిలీజ్‌

6 గంటల క్రితం

‘రాపో-23’ నుంచి పోస్టర్ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 07:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రామ్‌ పోతినేని స్వీయ కథ, దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రాపో -23'. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్‌ నటిస్తోంది. కీలక పాత్రలో బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ నటిస్తున్నారు. గురువారం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా నుంచి పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్‌ వోల్ఫ్‌’ అనే క్యాప్షన్‌తో విడుదలైన ఈ పోస్టర్‌లో రామ్‌ బ్లాక్‌ డ్రెస్సులో ఒక చేతిలో టెడ్డీబేర్‌, మరో చేతిలో తుపాకీ పట్టుకుని కనిపించారు. తన దారిని తానే ఎంచుకుని, ప్రపంచాన్ని ఒంటరిగా ఎదుర్కొనే ఒక స్వతంత్ర వ్యక్తి కథగా సినిమా ఉండబోతుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. రాపో సినిమాటిక్స్‌ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ టీజర్‌ను త్వరలోనే రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్