గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రేమనే ఊరిలో ‘ఏరై పారే హృదయం’

1 గంట క్రితం

premane urilo .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ పాటను మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి విడుదల చేశారు. సమీరా భరద్వాజ్ ఆలపించిన ఈ పాటకు రాంబాబు గోసాల సాహిత్యం అందించగా, సునాద్ గౌతమ్ బాణీ సమకూర్చారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్