బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition'వారణాసి'లో ప్రియాంకే డబ్బింగ్?

1 గంట క్రితం

priyanka-chopra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మహేష్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'లో ప్రియాంక చోప్రా తన పాత్రకు తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెబుతారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని నిర్మాత కె.ఎల్‌. నారాయణ తెలిపారు. గతంలో ప్రియాంక చోప్రా సామాజిక మాధ్యమాల ద్వారా తాను తెలుగు నేర్చుకుంటున్నానని, వీలైతే తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. దీంతో ఆమె స్వరమే సినిమాలో వినిపించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. సినిమా అన్ని భాషల్లో విడుదలయ్యే నేపథ్యంలో డబ్బింగ్‌పై తుది నిర్ణయం విడుదలకు దగ్గరగా తీసుకుంటామని నారాయణ చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్