దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం 'రణబాలి`. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ ప్రారంభించింది. ఈ చిత్రానికి సంబంధించి నాలుగు డాక్యుమెంటరీ సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ ను ట్రూత్ :1 ‘ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్’ పేరుతో వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ వీడియోలో దర్శకుడు, రష్మిక, విజయ్ దేవరకొండ భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న కాలంలో1876-78 ఈ రెండు సంవత్సరాల్లో తీవ్ర కరువు తాండవించిందని.. ఆ సమయంలో భారతీయులు తినడానికి తిండి లేక అల్లాడిపోయినా బ్రిటిష్ వాళ్లు తిండి గింజలు ఇవ్వక వారిని దారుణంగా హింసించారని చారిత్రికంగా తెలుసుకున్నామని వారు వివరించారు.
‘రణబాలి’ డాక్యుమెంటరీ ఫస్ట్ పార్ట్
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 05:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)