శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition'రణబాలి` డాక్యుమెంటరీ సెకండ్‌ పార్ట్‌

30 సెప్టెంబర్, 2026

'రణబాలి` డాక్యుమెంటరీ సెకండ్‌ పార్ట్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 08:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ ‘రణబాలి’. ఇందులో హీరో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వరుసగా సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీలను విడుదల చేస్తూ ఆసక్తి పెంచుతోంది. ఇటీవల పార్ట్‌ 1 విడుదలైంది. బుధవారం మేకర్స్ డాక్యుమెంటరీ సెకండ్ పార్ట్‌ ‘ట్రూత్‌ 2: ది హిస్టరీ వుయ్‌ ఫర్గాట్‌’ను విడుదల చేశారు. భారతదేశంలో బ్రిటిషర్లు రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కారణాన్ని విజయ్ దేవరకొండ ఈ వీడియోలో వివరించారు. ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్