సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ‘రోమాంచకం’ ఈ నెల 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిసిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విశేషాలను నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘రోమాంచకం’ కథలో హ్యూమర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫ్రెండ్స్ మధ్య జరిగే సరదా సన్నివేశాలు నచ్చడంతో టేకప్ చేశాం. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి స్క్రిప్ట్ నెరేషన్ కూడా మమ్మల్ని ఆకట్టుకుంది. సుమంత్ ప్రభాస్ పాత్ర నేపథ్యంలో కథ సాగుతుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడి జీవితం, ప్రేమకథ, అతని స్నేహితుల మధ్య జరిగే సంఘటనలు వినోదాన్ని అందిస్తాయి. వాసుకి అందించిన సంగీతం కథతో బాగా బ్లెండ్ అయింది. ఎక్కడా ఫోర్స్‌ఫుల్ కామెడీ ఉండదు. వేణుగోపాల్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీ డైరెక్టర్. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశారు. కథ హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. స్లాంగ్ కూడా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది. వచ్చే ఏడాది ‘అర్జున్ రెడ్డి’ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొన్ని సన్నివేశాలు జోడించి రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.’’ అని ప్రణయ్ రెడ్డి తెలిపారు.
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ....
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)