శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘తార’గా రుక్మిణీ వసంత్‌

31 నిమిషాల క్రితం

‘తార’గా రుక్మిణీ వసంత్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘కాంతారా 2’తో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణీ వసంత్‌ తాజాగా యువ దర్శకుడు శ్రీకార్తిక్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. క్రేజీ రోడ్‌ ట్రిప్‌ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఆమె ‘తార’ అనే విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం తాజాగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ ఫన్నీ ప్రోమోలో దర్శకుడు శ్రీకార్తిక్‌ వినోదాత్మకంగా కథను వివరించగా, రుక్మిణీ వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చూపించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్