సత్యదేవ్ నటిస్తోన్న ఎకోలాజికల్ యాక్షన్ మూవీ ‘సమవర్తి’. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ టీజర్‌ను కోటి మంది వీక్షించడంతో ఈ చిత్రంపై బజ్ క్రియేట్ అయింది. సత్యదేవ్‌కు ఇది 16వ చిత్రం. అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, రుద్ర తదితర నటులు నటిస్తున్నారు. రుద్ర పిక్చర్స్, పంచభూత ప్రొడక్షన్స్ బ్యానర్లపై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'సమవర్తి` టీజర్ విడుదల
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 07:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)