ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘కొరివి’గా శ్రీధర్‌ గాదె కొత్త సినిమా

21 గంటల క్రితం

‘కొరివి’గా శ్రీధర్‌ గాదె కొత్త సినిమా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 06:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘ఎస్ఆర్‌ కళ్యాణమండపం’ ఫేమ్‌ దర్శకుడు శ్రీధర్‌ గాదె తెరకెక్కిస్తున్న కొత్త చిత్రానికి ‘కొరివి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం దర్శకుడి పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అడవిలోని ఓ అంతుచిక్కని రహస్యం, భయానక వాతావరణం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు గ్లింప్స్‌ సూచిస్తోంది. శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌ పతాకంపై వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రొడక్షన్‌ నంబర్‌ 3గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్‌ ఈశ్వర్‌ రాచిరాజు, నందు, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్