గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

రజనీకాంత్‌ మూవీలో శ్రీలీల

5 గంటల క్రితం

Rajinikanth-sreeleela-movie
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 09:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ చాలా ఏళ్ల తర్వాత కలిసి పనిచేస్తున్న చిత్రం ‘ధర్మన్‌’. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నటి శ్రీలీలను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం. ఆమె కూడా అందుకు అంగీకరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. అశ్వత్‌ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌ తన సినీ జీవితంలో తొలిసారిగా వైద్యుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రాశీ ఖన్నా, యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌తో పాటు చెన్నైకి చెందిన కంటెంట్‌ క్రియేషన్‌ సంస్థ టర్మరిక్‌ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్