బాల్య జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’ చిత్రం నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించారు. సినిమా విడుదల నేపథ్యంలో ధీరజ్ మీడియాతో మాట్లాడారు. ఈ కథ వినగానే తన బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని, ప్రేక్షకులకూ అదే అనుభూతి కలుగుతుందనే నమ్మకంతో సినిమాను నిర్మించానని తెలిపారు. వేసవి సెలవుల్లో రెండు నెలలు అమ్మమ్మ ఊరిలో గడిపి తిరిగి వెళ్లిపోయే పిల్లలు, అక్కడి స్నేహితుల మధ్య అనుబంధం, అరుణ్, రోహన్ పాత్రల బాండింగ్, తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను హత్తుకుంటాయని చెప్పారు. ఇందులో ప్రత్యేకంగా సందేశం ఏమీ ఉండదని, మంచి భావోద్వేగాలే ప్రధానమని పేర్కొన్నారు. కథలోని సహజత్వం, సున్నితత్వం దర్శకుడి పనితీరులోనూ కనిపించాయని, ప్రతి సన్నివేశం, దృశ్యాన్ని సహజంగా తెరకెక్కించారని ధీరజ్ ప్రశంసించారు.
6న ‘సమ్మర్ హాలిడేస్’
20 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026, 07:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)