మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తేజ సజ్జ హోస్ట్‌గా... ‘ది ట్రైటర్స్’

9 గంటల క్రితం

తేజ సజ్జ హోస్ట్‌గా... ‘ది ట్రైటర్స్’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 07:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విదేశాల్లో, హిందీలో భారీ ఆదరణ పొందిన సూపర్‌హిట్‌ రియాలిటీ గేమ్‌ షో ‘ది ట్రైటర్స్‌’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ షోకి హీరో తేజ సజ్జ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. “ఈ గుడ్‌ న్యూస్‌ మీ అందరితో చెప్పడానికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఈ షోకి హోస్ట్‌గా చేయడం నాకు కొత్త అనుభవం. ఒక కొత్త రకం గేమ్‌తో, కొత్త ఉత్సాహంతో మీ ముందుకు వస్తున్నాను” అని తేజ పోస్ట్‌ చేశారు. ఈ షో పూర్తిగా మైండ్‌ గేమ్‌. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో అక్టోబర్‌ 15 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ గేమ్‌ షోకు సంబంధించి ఓటీటీ సంస్థ అమెజాన్‌ ఆసక్తికరమైన ప్రోమోను కూడా విడుదల చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్