కన్నడ స్టార్ హీరో దర్శన్ నటించిన ‘ద డెవిల్’ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా జూలై 17 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తొలుత కన్నడ భాషలో మాత్రమే విడుదల చేయనున్నట్లు, అనంతరం ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రకాష్ వీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రచనా రాయ్ కథానాయికగా నటించారు. గతేడాది డిసెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం దాదాపు ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ప్రస్తుతం హీరో దర్శన్ తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో న్యాయపరమైన విచారణను ఎదుర్కొంటున్నారు.
Print Editionఓటీటీలోకి 'ద డెవిల్`
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 08:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)