బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకుంటారు

3 గంటల క్రితం

naresh.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 08:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది?

సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. కథానాయకుడు ‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

కథ నచ్చడానికి కారణం?

చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్‌టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్ర మోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. చంద్ర మోహన్ ఈ కథని చక్కగా రాసుకొని వచ్చారు. నందు మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఇందులో నాది చాలా ఎంటర్టైనింగ్ ఉండే క్యారెక్టర్. చాలా కష్టాలు వస్తుంటాయి. ఎలా ఎదుర్కొన్నాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా హ్యాపీగా నవ్వుకుంటారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్