ప్రముఖ నటుడు ఎస్ జె సూర్య నటించిన ‘వదంది’ అనే వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 2022లో విడుదలైన ఈ సిరీస్ కి సీక్వెల్ గా తెరకెక్కిన సిరీస్ త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. సరికొత్త కథతో, కొత్త పాత్రలతో రూపొందిన 'వదంది: ది మిస్టరీ ఆఫ్ మణి' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ రెండో సీజన్‌లో శశికుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ సీజన్‌లో ఎస్సై చేసిన తప్పు వల్ల ఓ అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తుంటాడు. తన తప్పు తెలుసుకున్న ఆ ఎస్సై.. ఆ వ్యక్తిని జైలు నుంచి ఎలా విడిపిస్తాడు అనే కథాంశంతో దర్శకుడు ఆండ్రూ లూయిస్ తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాతలు పుష్కర్ - గాయత్రిలు నిర్మించారు. ఈ సిరీస్ ఆగస్టు 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఓటీటీలోకి ‘వదంది’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 27, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)