రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వారణాసి'. ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ స్పందించింది. సినిమా షూటింగ్ పూర్తయిందని, విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించింది. 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో కలుద్దామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో విడుదల వాయిదా ప్రచారానికి తెరపడింది. త్వరలోనే రాజమౌళి నటీనటులతో కలిసి మీడియా ముందుకు వచ్చి సినిమా విశేషాలను వెల్లడించనున్నారు. మైథాలజీ, టైమ్ ట్రావెల్, యాక్షన్ అంశాలతో కూడిన అడ్వెంచర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో మహేశ్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా, పృథ్వీరాజ్ 'కుంభ'గా కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. కార్తికేయ కూడా నిర్మాణ బాధ్యతల్లో భాగస్వామిగా ఉన్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్న తొలి నాన్-ఇంగ్లీష్ చిత్రంగా 'వారణాసి' నిలవనుంది.
ప్రకటించిన తేదీకే 'వారణాసి`
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 07:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)