విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'కింగ్‌డమ్'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు వెంకటేశ్ వి.పి.. ఇప్పుడు అతనికి తెలుగులో హీరోగా నటించే అవకాశం లభించింది. 'కె ర్యాంప్' చిత్రాన్ని నిర్మించిన బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో ధీరజ్ న్యాతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సురేశ్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'డి.జి.పి.' అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టుకున్నారు. వెంకటేశ్ వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 'సుడా సుడా ఇడ్లీ' అనే రెస్టారెంట్ స్టార్టప్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్నారు. 'కింగ్‌డమ్' చిత్రంలో వెంకటేశ్ పోషించిన మురుగన్ పాత్ర అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆగస్టు 20 వెంకటేశ్ వి.పి. బర్త్‌డే సందర్భంగా ఆయనకు చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్‌కమ్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ సినిమాకు జ్ఞానీ సంగీతం అందిస్తున్నారు.
Print Edition'కింగ్‌డమ్' వెంకటేశ్ హీరోగా...
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 08:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)