గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'వృషకర్మ' ట్రైలర్ విడుదల

1 గంట క్రితం

'వృషకర్మ' ట్రైలర్ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 07:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నాగచైతన్య కథానాయకుడిగా కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వృషకర్మ'. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన ట్రైలర్ థ్రిల్లర్ అంశాలతో ఆసక్తి రేకెత్తిస్తోంది. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నాగచైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం దర్శకుడు ఎంతో కష్టపడ్డారని, ప్రేక్షకులు ఇంతకుముందు చూడని విజువల్స్ ఇందులో ఉంటాయని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకుడు సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్