సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ట్రోల్స్‌ను ఆశీర్వాదాలుగా తీసుకున్నాం : అఖిల్‌

1 గంట క్రితం

akhil and zainab
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 08:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అఖిల్‌ కంటే ఆయన భార్య జైనబ్‌ వయసులో పెద్దదని, ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారంటూ సోషల్‌ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌పై అఖిల్‌ స్పందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెళ్లి తర్వాత వచ్చిన విమర్శలకు తాను ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని చెప్పారు. ‘‘పెళ్లికి ముందే ఇలాంటి విమర్శలు రావొచ్చని నా భార్యకు చెప్పాను. ఈ విషయంలో ఆమె ఎంతో పరిణతితో ఆలోచించింది. నా కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సమయంలో ఆమె నాకు అండగా నిలిచింది. నాకు కావాల్సిన ధైర్యం, ప్రేమ, మద్దతు ఇచ్చింది’’ అని అఖిల్‌ అన్నారు. ‘‘ప్రేమలో కులం, మతం, వయసు కంటే ఇద్దరి మధ్య పరస్పర అవగాహన, నమ్మకమే ముఖ్యం. అందుకే ఆ ట్రోల్స్‌ను మేమిద్దరం ఆశీర్వాదాలుగానే స్వీకరించాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్