బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అ’ టైటిల్ పెట్టడానికి కారణమిదే...

9 గంటల క్రితం

'అ` టైటిల్ పెట్టడానికి కారణమిదే... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘అ’ విడుదల వాయిదా పడింది. నిర్మాణానంతర పనులు పూర్తికాకపోవడంతో ఈ చిత్రాన్ని నవంబర్‌ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇందులో రాహుల్‌ నిజాయతీగల పోలీసు అధికారిగా కనిపించనున్నారు. సాయి బాలి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్‌ బాక్స్‌ స్టోరీస్‌, రిపుల్‌ స్లైడ్‌ స్టూడియోస్‌ పతాకాలపై కనకరావు తొనంగి, అభిషేక్‌ కె., ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘికం, అమానుషం వంటి పదాల చుట్టూ కథ సాగుతుందని, అందుకే ‘అ’ అనే టైటిల్‌ను ఖరారు చేశామని తెలిపారు. ఇన్వెస్టిగేషన్‌ డ్రామాలో రాహుల్‌ విజయ్‌ తెరపై శక్తిమంతంగా కనిపిస్తారని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్