mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నాగాలాండ్‌లో అరుదైన కప్ప జాతి గుర్తింపు

30 మే, 2026

Nagaland yields
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 05:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొహిమా: భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో శాస్త్రవేత్తలు అరుదైన జాతికి చెందిన `జలపాత కప్ప' (క్యాస్కేడ్ కప్ప)ను గుర్తించారు. ప్రపంచానికి ఇటప్పటివరకు తెలియని ఈ వినూత్న కప్ప జాతిని నాగాలాండ్ పర్వత ప్రాంతాల్లోని ప్రవాహాలు, జలపాతాల వద్ద గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పర్వత ప్రాంతాల్లో వేగంగా ప్రవహించే నీటి ప్రవాహాల (జలపాతాల) మధ్య నివసించే విశిష్ట లక్షణం ఉన్నందున వీటికి జలపాత కప్పలు (క్యాస్కేడ్ కప్పలు) అని పేరు పెట్టారు. పర్యావరణ వైవిధ్యానికి నిలయమైన ఈశాన్య భారత ప్రాంతంలో, ముఖ్యంగా నాగాలాండ్ అడవులలో జీవవైవిధ్యంపై జరుగుతున్న పరిశోధనల్లో భాగంగా ఈ అరుదైన  జీవి వెలుగుచూసిందని అన్నారు. ఈ కొత్త కప్ప జాతి గుర్తింపుతో ఈ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణుల వైవిధ్యం, పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యత మరోసారి నిరూపితమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ అరుదైన  ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను అంతర్జాతీయ సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అరుదైన జీవులు  మనుగడ సాగించాలంటే అవి నివసించే సహజ సిద్ధమైన జలవనరులను, అటవీ ప్రాంతాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్