వాషింగ్టన్ : అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు 1389మంది భారతీయ చిన్నారులను నిర్బంధించారు. వీరంతా తోడు ఎవరూ లేని పిల్లలే, 2023 నుండి వీరందరూ అధికారుల కస్టడీలోనే వున్నా ఎవరినీ వెనక్కి పంపించలేదని అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా వెల్లడించింది. తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లేకుండా ప్రయాణిస్తున్న భారతీయ మైనర్ల సంఖ్య 2023లో 730గా వుండగా, 2024లో 517కు, 2025లో 91కి, 2026లో 51కి తగ్గింది. ఈ ఏడాది అక్టోబరులో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేవలం భారతీయులే కాదు, మొత్తంగా అన్ని దేశాలకు చెందిన చిన్నారుల సంఖ్య కూడా తగ్గినట్లు గణాంకాలు నమోదయ్యాయి. అన్ని దేశాలకు చెందిన మైనర్ల సంఖ్య కూడా 2024లో 1.1లక్షలుగా వుండగా ఈ ఏడాది 9,190కి, అక్టోబరులో 722కి తగ్గింది. ట్రంప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరే ప్రధాన కారణంగా వుంది. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు చేపట్టిన కఠినమైన అణచివేత చర్యలు, వేగంగా వారిని వారి దేశాలకు తరలించే చర్యల ఫలితంగా వీరి సంఖ్య తగ్గినట్లు భావిస్తున్నారు. అంతకుముందు తల్లిదండ్రులు లేదా బంధువులు చట్టబద్ధమైన నివాస హోదాను సంపాదించుకునేందుకు గల అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు మైనర్లను ఉపయోగించుకునేవారు. అయితే ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఇప్పటికే అమెరికాలో జీవిస్తున్న భారతీయ చిన్నారుల్లో భయాందోళనలు తలెత్తాయి. మొత్తంగా 30,528మంది భారతీయులను అక్రమవలసదారులంటూ అధికారులు పట్టుకున్నారు. మెక్సికో, కెనడా తర్వాత మూడో స్థానంలో భారతీయులే వుంటారు.
అమెరికా అధికారుల నిర్బంధంలో 1389మంది భారత చిన్నారులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)