శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యాలో ఘోర విమాన ప్రమాదం

18 నవంబర్, 2026

russia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 08:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 19 మంది మృతి

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సైబీరియాలోని కెమెరోవో ప్రాంతంలో ఆంటోనోవ్ ఏఎన్-12 సైనిక కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సిబ్బందితో సహా మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మంగళవారం రాత్రి కెమెరోవోలోని యగునోవో గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలం ప్రాంతీయ రాజధానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గవర్నర్ ఇల్యా సెరెడ్యూక్ వెల్లడించారు. సాధారణ సర్వీసులో ఉండగా విమానం ప్రమాదానికి గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇంధనం లీకేజీ కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకదానికి మంటలు అంటుకున్నట్లు భావిస్తున్నారు. అనంతరం విమాన నియంత్రణ వ్యవస్థలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇంధన వ్యవస్థలో లోపం, హైడ్రాలిక్ వ్యవస్థ వైఫల్యం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని రష్యా వార్తా సంస్థ బాసా నివేదించింది.

ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించేందుకు విమానయాన ప్రమాద దర్యాప్తు కమిషన్, ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ ప్రారంభించాయి. అత్యవసర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్