బీజింగ్ : చైనా కమ్యూనిస్ట్ పార్టీ 5వ ప్లీనమ్ సమావేశాలు సోమవారం బీజింగ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ కేంద్ర కమిటీ ప్లీనమ్‌కు జిన్‌పింగ్ నాయకత్వం వహిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణను బలోపేతం చేయడం, అవినీతిని అరికట్టడం, పాలనా సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్లీనమ్‌లో కేంద్ర కమిటీకి చెందిన సుమారు 300 మంది సభ్యులు పాల్గొంటున్నారు. అవినీతిని అరికట్టడంతో పాటు పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు కచ్చితంగా అమలయ్యేలా చూడటం, బాధ్యతల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం, పాలనా వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలు కూడా ఈ సమావేశం పరిశీలనలో ఉన్నాయి. ప్లీనమ్‌లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి షీ జిన్‌పింగ్ ముసాయిదా పత్రాన్ని సమర్పించారు. 2012లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి జిన్‌పింగ్ అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ అధికారులు, సైనిక అధికారులతో సహా పలువురిపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్నారు. 2022లో ఏర్పాటైన ప్రస్తుత కేంద్ర కమిటీకి ఇది ఐదవ ప్లీనమ్. 2027లో జరగబోయే పార్టీ కాంగ్రెస్‌కు ముందు జరుగుతున్న కీలక సమావేశంగా ఈ ప్లీనమ్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది.








కామెంట్‌లు (0)