మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - విపత్తులో పాపం పసివాళ్లు ..!

31 ఆగస్టు, 2026

Alas, the little ones caught in the disaster...!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 03:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నేపాల్ : అకస్మాత్తుగా నేపాల్ పై విరుచుకుపడిన జలప్రళయం .... ఎంతోమందిని అభాగ్యులను చేసింది..! రాకాసిలా ఉవ్వెత్తున ఎగసిపడి మింగేసిన వరదలో ఎంతోమంది కొట్టుకుపోయారు. విషాదం గడిచి నాలుగు రోజులయినా ... శవాల దిబ్బగా మారిన నేపాల్ లో ... తమవారి కోసం ఆందోళనగా వెతుకులాడుతున్నారు. చెల్లాచెదురైపోయిన ఇండ్లు, ఎవరు ఉన్నారో, లేరో, తెలియని పరిస్థితి..! ఇక ఏ దిక్కూ తోచని పసివాళ్లు అమ్మానాన్నలు ఎక్కడ అంటూ వెతుకులాడుతున్నారు. నేపాల్ లోని భారీ వరదల తాలూకు ఓ హృదయవిదారక దృశ్యం చూపరులందరి గుండెలను తొలిచేస్తుంది.


వరద ప్రభావిత ప్రాంతాల గుండా ఓ బాలుడు తన చెల్లిని వీపుపై మోస్తూ నీరసంగా నడుస్తూ కనిపిస్తాడు. అతడు ఆమెను ఓదార్చేలా దగ్గరకు పట్టుకున్నట్లుగా ఆ పరిసర ప్రాంతాల్లో కలయతిరగడం చూస్తే.. ప్రకృతి విపత్తు మిగిల్చిన విషాదం ఇంత భయానకంగా ఉంటుందా అనిపిస్తుంది. ఆ చిన్నారి తన తల్లిదండ్రుల ఆచూకీ కోసం తిరుగుతున్నాడా.. లేక మరేదైనా కారణముందా ? తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ అధికారులు వరద బాధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నేపాల్‌ వరదలతో అతలాకుతలమైన సమయంలో బయటకు వచ్చిన ఈ వీడియో ప్రకృతి విపత్తు ఇద్దరు చిన్నారులకు ఎలాంటి కష్టాలను మిగిల్చిందనే దాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చింది. కాగా, నెట్టింట వైరల్‌ అవుతున్న ఆ వీడియోని చూసి నెటిజన్లు చిన్నారులు అంత నిస్సహాయంగా తిరుగుతుంటే సాయం చేయడం మానేసి వీడియో తీస్తున్న వ్యక్తి ఎవరు అంటూ తిట్టిపోస్తున్నారు. మరికొందరు.. తోబుట్టువులు అనుబంధాన్ని చాటిచెప్పడమే కాదు ఆ చిన్న భుజాలు ఎంత పెద్ద బాధ్యతను మోస్తున్నాయి. వారి కళ్లను చూస్తుంటేనే బాధంతా అర్థమైపోతోంది అంటూ పోస్టులు పెట్టారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్