ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అంత్యక్రియలకు వెళ్లివస్తుండగా ప్రమాదం .. 22మంది మృతి

56 నిమిషాల క్రితం

Kenya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 04:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నైరోబి : కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో సుమారు 22 మంది మరణించారని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. రాజధాని నైరోబీని, తీరప్రాంత నగరమైన మోంబాసాను కలిపే రహదారిపై ఆదివారం ఉదయం ప్రమాదం జరిగిందని అన్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నామని అన్నారు. అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మకుయెని కౌంటీ కమిషనర్ అబ్దుల్లాహి ఖలీఫ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుందని అన్నారు. ప్రమాదం జరిగిన రహదారి భాగాన్ని 'ప్రమాదాల బ్లాక్ స్పాట్'గా గుర్తించామని, భద్రతాపరమైన ఆందోళనలను పరిష్కరించడానికి సిఫార్సు చేశామని కెన్యా జాతీయ రవాణా, భద్రతా అథారిటీ తెలిపింది. మూడు వారాల క్రితం జరిగిన ఇదే రహదారిపై జరిగిన ప్రమాదంలో 17 మంది మరణించారని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్