దశాబ్ద కాలం తర్వాత కైరోలో చైనా అధినేత
ఈజిప్ట్‌లో సైనిక లాంఛనాలతో జిన్‌పింగ్‌కు స్వాగతం
కైరో : చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ దశాబ్దకాలం తర్వాత బుధవారం నాడు తొలిసారి ఈజిప్ట్ పర్యటనకు వెళ్లారు. కైరో లో ఆయనకు ఈజిప్టు అధ్యక్షులు అబ్దెల్ ఫతా అల్‘సిసి ఘన స్వాగతం పలికారు. ఈ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాలు తమ దీర్ఘకాలిక భద్రతా సంబంధాలను పున్ణసమీక్షిం చుకుంటున్న సమయంలో చైనాతో ఈజిప్ట్ సంబంధాలు బలపడుతున్నాయని ఈ పర్యటన స్పష్టం చేస్తోంది. దశాబ్ద కాలం తర్వాత తొలిసారిగా కైరోలో అడుగు పెట్టిన జిన్‌పింగ్‌కు ఇత్తిహాదియా అధ్యక్షభవనంలో సైనిక లాంఛనాలతో స్వాగతం పలికామని ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో నెలల తరబడి కొనసాగుతున్న అశాంతి నేపథ్యంలో ఈ పర్యటన జరుగుతోంది. అమెరికాకు రక్షణ భాగస్వామిగా కొనసాగుతున్న ఈజిప్ట్ అదే సమయంలో చైనాతో ఆర్థిక, సైనిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకుంది. 2014లో ఈజిప్ట్ అధ్యక్షులు సిసి చైనాలో పర్యటించి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్రమేపీ విస్తరించాయి. జిన్‌పింగ్ పర్యటనపై ఈజిప్ట్‌లో చాలా కాలం నుంచే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని కైరో వీధులను చైనా పతాకాలతో, ఇరు దేశాలలోని ప్రసిద్ధ ప్రదేశాల చిత్రాలతో అలంకరించారు. చైనీయులు ఈజిప్ట్ విషయంలో సానుకూల దృక్పధంతో ఉన్నారని చూపే అభిప్రాయ సేకరణలకు ఈజిప్ట్ మీడియా విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఆధునిక చైనా ఆయుధ వ్యవస్థలపై ప్రత్యేక వ్యాసాలను అందిస్తోంది. గత నెలలో చైనా`ఈజిప్ట్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఈగల్స్ ఆఫ్ సివిలైజేషన్’ విన్యాసాలు బలపడుతున్న ద్వైపాక్షిక సైనిక సంబంధాలకు అద్దం పట్టాయి. ఇటీవలి చైనా కంపెనీలు ఈజిప్ట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి.








కామెంట్‌లు (0)