మక్కాపై డ్రోన్ దాడి ఆరోపణలను రాజకీయం చేయొద్దు: ఇరాన్
టెహ్రాన్ : ఇస్లామిక్ పవిత్ర నగరం మక్కాను లక్ష్యంగా చేసుకుని హౌతీలు డ్రోన్ దాడికి యత్నించారన్న ప్రచారంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాల భద్రతను అడ్డం పెట్టుకుని ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, మక్కా పేరుతో జరుగుతున్న ఈ ఆరోపణలను రాజకీయం చేయడం మానుకోవాలని ఇరాన్ హితవు పలికింది. నిరాధార ఆరోపణలతో ముస్లిం దేశాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు పవిత్ర నగరమైన మక్కాను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడికి యత్నించారన్న సౌదీ అరేబియా ఆరోపణల నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యాఖ్యలు చేసింది. మక్కా అల్-ముకరామా, మదీనా అల్-మునవ్వరా, అల్-అక్సా మసీదులతో పాటు వాటి పరిసర ప్రాంతాలు, యాత్రికుల రక్షణ అందరి బాధ్యత అని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయెల్ బఘాయీ తెలిపారు.








కామెంట్‌లు (0)