మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రగ్స్‌ మాఫియాపై వార్తలు.. జర్నలిస్టును కాల్చిచంపిన దుండగులు

17 నవంబర్, 2026

Camilo Rodríguez .jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 03:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శాన్‌జోస్‌ : డ్రగ్స్‌ అక్రమ రవాణా, అవినీతిపై బహిరంగంగా వార్తలు ప్రచురించిన సెంట్రల్‌ అమెరికాలోని కోస్టారికా జర్నలిస్ట్ కామిలో రోడ్రిగ్జ్‌ను గుర్తు తెలియని దుండగులు సోమవారం కాల్చి చంపారు. తనకు ప్రాణహాని ఉందని, బెదిరింపులు వస్తున్నాయని రోడ్రిగ్జ్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రోడ్రిగ్జ్‌ శాన్‌ మిగెల్‌ డి శాంటో డొమింగో జిల్లాలో ప్రయాణిస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అతిదగ్గరగా కాల్చి చంపారు. ఈఘటనపై న్యాయ విచారణ విభాగం (ఒఐజె) దర్యాప్తు ప్రారంభించింది.
డ్రగ్స్‌ అక్రమ రవాణా, అవినీతికి సంబంధించిన వార్తలను రోడ్రిగ్జ్‌ సోషల్‌మీడియాలో వరుస వీడియోల్లో వెల్లడించారు. నిందితుల పేర్లతో పాటు, నేర సంస్థలతో వారికి ఉన్న సంబంధం గురించి ఆ వీడియోల్లో వివరించారు. ఈ ఘటనపై అటార్నీ జనరల్‌ కార్లో డియాజ్ స్థానిక మీడియాతో మాట్లాడారు. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ రోడ్రిగ్జ్ గతంలోనే ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. బాధితులు, సాక్షులకు సహాయం అందించే ఒక కార్యక్రమంలో ఆయన పేరు నమోదు చేసుకున్నప్పటికీ, అటార్నీ జనరల్ కార్యాలయం సిఫార్సు చేసిన భద్రతను ఆయన తిరస్కరించారని అన్నారు. రోడ్రగ్జ్‌ వెల్లడించిన వివరాలను, హత్యకు గల ఇతర కారణాలను దర్యాప్తు అధికారులు పరిశీలిస్తారని డియాజ్ చెప్పారు. సోషల్ మీడియాలో అతను బహిరంగంగా ఆరోపించిన వారందరినీ, అలాగే అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నామని డియాజ్ అన్నారు.
జర్నలిస్ట్‌ హత్య రోడ్రిగ్జ్‌ హత్యను కోస్టారికా అధ్యక్ష‍ుడు లారా ఫెర్నాండేజ్‌ ఖండించారు. ఇది ‘‘ పిరికిపంద చర్య’’ అని అన్నారు. ఈ చర్య భావప్రకటనా స్వేచ్ఛకు ఒక మచ్చలాంటిదని అభివర్ణించారు.
కోస్టారికాలో ఏడాదికి సుమారు 900 హత్యలు జరుగుతున్నాయని, వీటిలో 70శాతం హత్యలకు డ్రగ్స్ అక్రమ రవాణాయే కారణమని అధికారులు పేర్కొన్నారు. చివరిసారిగా జర్నలిస్టులు 2001లో పార్మెనియో మెడినా, 2003లో ఇవాన్యా మోరాలు హత్యకు గురయ్యారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్