వెనెజువెలా : వెనెజువెలాలో జూన్ 24వ తేదీన కొద్ది సెకెన్ల వ్యవధిలో సంభవించిన రెండు తీవ్ర భూకంపాలు భారీ విషాదాన్ని మిగిల్చాయి. తాజా అధికారిక లెక్కల ప్రకారం .... మృతుల సంఖ్య 4 వేల మార్కును దాటింది. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు చిక్కుకుని ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. జూన్ 24న వరుసగా 7.5, 7.2 తీవ్రతలతో సంభవించిన భూకంపాలు ముఖ్యంగా లా గువెరా తీర ప్రాంతాన్ని ఎక్కువగా దెబ్బతీశాయి. అనేక బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలగా, వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా 16,740 మంది గాయపడ్డారు. శిథిలాల తొలగింపు కార్యక్రమం ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భూకంపాల కారణంగా వేలాది కుటుంబాలు తమ ఇండ్లను కోల్పోయాయి. తాత్కాలిక శిబిరాల్లో ఆశ్రయం పొందిన ప్రజలు తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవల కొరతను ఎదుర్కొంటున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణం కోసం, బాధితులకు అత్యవసర సహాయం అందించేందుకు ఐక్యరాజ్యసమితి వందల మిలియన్ల డాలర్ల నిధులను సమీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. శిథిలాలను తొలగించే కార్యక్రమంలో దేశీయ, అంతర్జాతీయ సేవా సంస్థలు పాల్గొంటున్నాయి. అయినప్పటికీ చాలా మంది గల్లంతైన తమ కుటుంబ సభ్యుల కోసం ఇంకా శిథిలాల వద్ద వెతుకులాట కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ యంత్రాలు లేకపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా శిథిలాలను తొలగిస్తూ మృతదేహాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు .... శుక్రవారం కారకాస్‌లో 3.0 తీవ్రతతో భూకంపం సంభవించడంతో స్థానికంగా ఉన్న భవనాలను ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వైపు దేశంలో కొనసాగుతోన్న భూకంప సహాయక చర్యల కోసం.. యూకే ఆంక్షల కింద విదేశాలలో స్తంభింపజేసిన సుమారు 30 టన్నుల వెనెజువెలా బంగారాన్ని విడుదల చేయాలని కింగ్ చార్లెస్ IIIని కోరినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ వెల్లడించారు.
వెనెజువెలాలో 4 వేలు దాటిన మృతులు ..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 11, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)