శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హోర్ముజ్ జలసంధిలో మైన్ల పేలుడు.. మూడు చమురు నౌకలకు అంటుకున్న మంటలు

19 నవంబర్, 2026

హోర్ముజ్ జలసంధిలో మైన్ల పేలుడు.. మూడు చమురు నౌకలకు అంటుకున్న మంటలు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్: హోర్ముజ్ జలసంధికి తూర్పు భాగంలో సముద్రపు మైన్లను (బాంబులు) ఢీకొని మూడు చమురు నౌకలకు మంటలు అంటుకున్నాయని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తమ నౌకాదళం జారీ చేసిన హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసి నిషేధిత ప్రాంతం గుండా ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని ఇరాన్ ఆరోపించింది.


ఇరాన్ నౌకాదళ హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ నౌకలు నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించాయని ఐఆర్‌జీసీని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో నౌకల నావిగేషన్ సిస్టమ్స్ ఆఫ్ చేసి ఉన్నాయని ఇరాన్ పేర్కొంది.


అత్యంత కీలకమైన ఈ జలమార్గం గుండా నౌకల రాకపోకలను ఇరాన్ అధికారుల సమన్వయంతోనే సాగించాలని ఆ దేశ అధికారిక వార్తా సంస్థ 'ఐఆర్‌ఐబీ' (IRIB) విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకల విషయంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఇదే ప్రాంతంలో కనీసం ఐదు నౌకలపై దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి.


ఈ జలమార్గంలో 'నకిలీ అమెరికన్ మార్గాల' (Fake American Routes) గుండా ప్రయాణించవద్దని నౌకలకు ఇరాన్ సైన్యం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధి గగనతలంలో రెండు అమెరికా డ్రోన్లను కూల్చివేసినట్లు కూడా ఇరాన్ ప్రకటించుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్