గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబ్రిక్స్‌ సదస్సు కోసం భారత్‌కు గుటెరస్‌

19 గంటల క్రితం

un
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్‌ : ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ భారత పర్యటన ఖరారైంది. ఈ నెలలోనే న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ 18వ సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ ఏడాది బ్రిక్స్‌‌కు చైర్మన్‌ ‌హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్‌ ‌మండపంలో ఈ సదస్సు జరగనుంది. బ్రిక్స్‌ ‌సభ్య దేశాల, భాగస్వామ్య దేశాల నేతలు, ఆహ్వానితులు అందరూ హాజరవుతారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. న్యూయార్క్‌‌లో గుటెరస్‌ ‌ప్రధాన కార్యదర్శి స్టీఫెన్‌ ‌డుజారిక్‌ ‌పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ఇంకా దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి వుందన్నారు. ‘వినూత్న ఆవిష్కరణ, సహకారం, సుస్ధిరత కోసం నిర్మాణం’ అంశంపై బ్రిక్స్‌‌సదస్సు జరగనుంది. రాజకీయాలు, భద్రత, ఆర్థికపరమైన, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు అనే మూడు ప్రధానమైన అంశాల ప్రాతిపదికన బ్రిక్స్‌ ‌వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌‌లో 25 నగరాల వ్యాప్తంగా 350కి పైగా సమావేశాలు, ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుటెరస్‌ ‌భారత్‌‌కు వచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఎఐ సదస్సులో పాల్గొన్నారు. ఆయన పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్