మంగళవారం, 15 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్‌లో స్వర్ణం సాధించిన భారత యువ దర్శకుడు స్టాన్జిన్ జిగ్మెట్

1 గంట క్రితం

భారతదేశ కీర్తికిరీటంలో మరొక ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది. లడఖ్‌కు చెందిన యువ ఫిల్మ్‌మేకర్ స్టాన్జిన్ జిగ్మెట్ 53వ 'స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్' పోటీల్లో గోల్డ్ మెడల్ (స్వర్ణ పతకం) గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించారు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 09:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

టోరంటో:

భారతదేశ కీర్తికిరీటంలో మరొక ప్రతిష్టాత్మక పురస్కారం చేరింది. లడఖ్‌కు చెందిన యువ ఫిల్మ్‌మేకర్ స్టాన్జిన్ జిగ్మెట్ 53వ 'స్టూడెంట్ అకాడమీ అవార్డ్స్' పోటీల్లో గోల్డ్ మెడల్ (స్వర్ణ పతకం) గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన తెరకెక్కించిన 'ది డ్రాగన్ లెటర్' (The Dragon Letter) అనే లఘు చిత్రానికి గాను ఈ అరుదైన గౌరవం దక్కింది.


కెనడాలోని టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) వేదికగా సోమవారం ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పోటీ కోసం ప్రపంచవ్యాప్తంగా 894 కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏకంగా 2,972 ఎంట్రీలు రాగా, అందులో జిగ్మెట్ రూపొందించిన చిత్రం ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.


భావోద్వేగానికి లోనైన జిగ్మెట్:

తన విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ జిగ్మెట్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.


"భారత హిమాలయాల్లోని లడఖ్‌లో ఉన్న మాల్బెఖ్ అనే మారుమూల గ్రామం నుండి ఆస్కార్ అకాడమీ వేదిక వరకు సాగిన ఈ ప్రయాణం నాకు ఇంకా ఒక కలలాగే అనిపిస్తోంది. ఈ పురస్కారం నా కుటుంబం, స్నేహితులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ఈ కథను నమ్మిన ప్రతి ఒక్కరికీ అంకితం. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మన కథల గమ్యాన్ని నిర్దేశించలేదు" అని పేర్కొన్నారు.


సినిమా నేపథ్యం:

స్టాన్జిన్ జిగ్మెట్ స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉన్న ప్రముఖ ESCAC సంస్థ నుండి ఫిల్మ్ డైరెక్టింగ్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన లడఖ్ కేంద్రంగా 'పిక్సెల్ ఛాలెంజర్ ఫిల్మ్స్' అనే ప్రొడక్షన్ హౌస్‌ను నడుపుతూ లడఖీ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.


ఈ అవార్డుల వేడుకలో అకాడమీ సీఈఓ బిల్ క్రామర్, ప్రముఖ దర్శకుడు జేసన్ రైట్‌మన్, హాలీవుడ్ నటులు గెమా చాన్స్, గారేల్ గార్సియా బెర్నాల్ తదితర అంతర్జాతీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జిగ్మెట్ సాధించిన ఈ విజయం పట్ల భారత సినీ రంగం హర్షం వ్యక్తం చేస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్