గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇజ్రాయేల్ దాడులపై నిరసన: ఎడ్ షీరన్ మ్యూజిక్ టూర్‌కు చిక్కులు

22 గంటల క్రితం

పాలస్తీనా, గాజాలపై ఇస్రాయేల్ జరుపుతున్న సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రఖ్యాత సంగీత కళాకారులు గళమెత్తడంతో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్‌కు చెందిన 'లూప్ టూర్' తీవ్ర అనిశ్చితిలో పడింది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 03:51 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూజెర్సీ: పాలస్తీనా, గాజాలపై ఇజ్రాయేల్ జరుపుతున్న సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రఖ్యాత సంగీత కళాకారులు గళమెత్తడంతో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్‌కు చెందిన 'లూప్ టూర్' తీవ్ర అనిశ్చితిలో పడింది. ఈ కార్యక్రమం నుంచి తోటి కళాకారుడు, అమెరికన్ ర్యాపర్ మెక్‌లెమోర్‌ను తొలగించాలనే ఒత్తిళ్లు రావడం, దానికి నిరసనగా మిగతా గాయకులు కూడా పర్యటన నుంచి తప్పుకోవడంతో వివాదం అంతర్జాతీయ స్థాయికి చేరింది.


వివాదానికి దారితీసిన ఘటన:

సెంప్టెంబర్ 4న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ప్రదర్శనలో మెక్‌లెమోర్ (బెన్ హాజెర్టీ) "ఫ్రీ పాలస్తీనా" అని వేదికపైనే నినాదాలు చేశారు. అంతేకాకుండా గాజా బాధితులకు మద్దతుగా తాను రూపొందించిన నిరసన గీతం 'హిండ్స్ హాల్'ను ఆలపించారు.


ఈ వ్యాఖ్యలపై ప్రొ-ఇస్రాయేల్ సంస్థలు, ఇస్రేలీ-అమెరికన్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మెక్‌లెమోర్‌ను టూర్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి. న్యూ ఇంగ్లాండ్ పేట్రియాట్స్ టీమ్, గిల్లెట్ స్టేడియం అధినేత రోబర్ట్ క్రాఫ్ట్ జోక్యం చేసుకుంటూ—మెక్‌లెమోర్‌ను తొలగించకపోతే ప్రదర్శనలకు వేదికను అనుమతించబోమని హెచ్చరించినట్లు వార్తలు వెలువడ్డాయి.

పాలస్తీనా, గాజాలపై ఇస్రాయేల్ జరుపుతున్న సైనిక చర్యలకు వ్యతిరేకంగా ప్రఖ్యాత సంగీత కళాకారులు గళమెత్తడంతో ప్రపంచ ప్రసిద్ధ బ్రిటీష్ గాయకుడు ఎడ్ షీరన్‌కు చెందిన 'లూప్ టూర్' తీవ్ర అనిశ్చితిలో పడింది.

ఒక్కటైన కళాకారులు :

స్టేడియం యాజమాన్యాల ఒత్తిళ్లతో మెక్‌లెమోర్‌ను టూర్ నుంచి తప్పించాల్సి వచ్చింది. అయితే, అభిప్రాయ స్వేచ్ఛపై జరుగుతున్న ఈ దాడిని నిరసిస్తూ ‘లూప్ టూర్’‌లో భాగమైన ఇతర ప్రముఖ ప్రదర్శనకారులు ఆరోన్ రోవ్, బయోగా, లూకాస్ గ్రాహం, ఫిన్నియాస్ తదితరులు సైతం ఈ టూర్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు.


మేము యుద్ధ నేరస్థులం కాబోము :

"లాభనష్టాలు, కార్పొరేట్ ఒత్తిళ్ల కంటే మానవత్వమే ముఖ్యం. పాలస్తీనాలో జరుగుతున్న వంశ హత్యపై మౌనంగా ఉంటే మేము కూడా యుద్ధ నేరస్థులమే అవుతాం" అని నిరసన తెలిపిన కళాకారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ఎడ్ షీరన్ స్పందిస్తూ, వేదికపై అభిప్రాయాలను వ్యక్తం చేసిన మెక్‌లెమోర్ ధైర్యాన్ని తాను గౌరవిస్తానని ప్రకటించారు.


ప్రస్తుతం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు మార్క్ రుఫాలో, కేట్ బ్లాంచెట్, బెన్ అఫ్లెక్, బ్రాడ్లీ కూపర్, డెంజెల్ వాషింగ్టన్ వంటి వారు కూడా 'ఆర్టిస్ట్స్ ఫర్ సీజ్‌ఫైర్' ద్వారా పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్