మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొలంబియాలో గని ప్రమాదం.. 14 మంది మృతి

11 గంటల క్రితం

2838b86470d0ef35d6983ec50e4f2fa5.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 02:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరో ఏడుగురికి గాయాలు.. 12-15 మంది గల్లంతు

బొగోటా: కొలంబియాలోని నారినో ప్రావిన్స్‌లో అక్రమ బంగారు గనిపై కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. శాంటా బార్బరా డి ఇస్కువాండే మున్సిపాలిటీ పరిధిలోని చాంబెరో ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మట్టిపెళ్లల కింద పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. ప్రమాదంలో 14 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. సహాయక చర్యలు ముగిసినట్లు నారినో గవర్నర్‌ లూయిస్‌ అల్ఫోన్సో ఎస్కోబార్‌ తెలిపారు. అయితే, మరో 12 నుంచి 15 మంది కార్మికులు గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ అధికారి జార్జ్‌ తోవర్‌ కాస్టిల్లో వెల్లడించారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న గనుల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. గనుల తవ్వకాలతో నేల అస్థిరంగా మారడం, భారీ వర్షాల సమయంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోంది. ఈ ఘటన అక్రమ గనుల్లో కార్మికుల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్