గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ పరిస్థితికి ముగింపు పలకాలి : ఖమేనీ

2 గంటల క్రితం

Mojtaba Khamenei
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 02:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, ఉద్రిక్తతలకు కారణమవుతున్న ‘యుద్ధం లేదు.. శాంతి లేదు’ అనే పరిస్థితికి ముగింపు పలకాలని ఇరాన్‌ సర్వోన్నత నాయకుడు అయతొల్లా సయ్యద్‌ మొజ్తబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌ తెలిపారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రాంతీయ పరిస్థితులు, జాతీయ సంసిద్ధత, శత్రువుల బెదిరింపులను ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం సిద్ధంగా ఉండాలని పెజెష్కియన్‌ సూచించారు. ఉత్పాదకతను పెంచడంతోపాటు జాతీయ సామర్థ్యాలను బలోపేతం చేయాలని కోరారు. ఆంక్షలు, బెదిరింపులు, బాహ్య ఒత్తిళ్లను తట్టుకునే సమర్థతను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. ఇరాన్‌ ప్రజల సంకల్పాన్ని దెబ్బతీసి, దేశాన్ని లొంగదీసుకోవచ్చని శత్రువులు భావించరాదని స్పష్టం చేశారు. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చి ప్రాంతీయ దౌత్య పరిణామాలపై మంత్రివర్గానికి నివేదిక సమర్పించారు. ఖతార్‌ ప్రతినిధి బృందం, పాకిస్తాన్‌ సైన్యాధిపతి పర్యటనల సందర్భంగా జరిగిన చర్చల వివరాలను వెల్లడించారు.

శాంతి చర్చలను పునఃప్రారంభించే ప్రయత్నాల్లో భాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఇరాన్‌ సీనియర్‌ నేత మొహ్సెన్‌ రెజాయీకి లేఖ పంపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాల మేరకు ఈ లేఖ పంపినట్లు సంబంధిత వర్గాలను ఉటంకించింది. ఇరు దేశాల మధ్య చర్చలకు ఒక మార్గాన్ని అన్వేషించడమే ఈ ప్రయత్నం ఉద్దేశమని పేర్కొంది. అయితే, టెహ్రాన్‌ తన వైఖరిని మార్చుకున్నట్లు ఆ కథనం తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్