గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Nepal Floods - వెయ్యి దాటిన మృతుల సంఖ్య..!

2 రోజుల క్రితం

Nepal Floods – Death Toll Crosses 1,000!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 03:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మండ్ : నేపాల్ వ‌ర‌ద‌ల్లో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. కేవ‌లం నేపాల్‌లో మృతిచెందిన వారి సంఖ్య 987 కు చేరుకోగా, ఇక టిబెట్ మృతుల‌తో క‌లిపితే ఆ సంఖ్య వెయ్యి దాటింది. వ‌ర‌ద వ‌చ్చిన దిగువ ప్రాంతాల్లో బురదలో కూరుకుపోయిన మృత‌దేహాల‌ను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారు. వరదలో గ‌ల్లంతయిన వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. కేవ‌లం నేపాల్‌లో 3916 మంది జాడ లేదు. వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. నేపాల్ ఆర్మీతో పాటు విదేశీ బృందాలు కూడా రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌డుతున్నాయి. చిత్వాన్ నుంచి సుమారు 321 మంది మృత‌దేహాల‌ను రిక‌వ‌రీ చేసిన‌ట్లు నేష‌న్ డిజాస్ట‌ర్ రిస్క్ రిడ‌క్ష‌న్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొన్న‌ది. న‌వ‌ల్‌పార‌సి ఈస్ట్ నుంచి 216, న‌వ‌ల్‌పార‌సి వెస్ట్ నుంచి 170 మంది, నువాకోట్ నుంచి 95 మంది మృత‌దేహాల‌ను రిక‌వ‌రీ చేశారు. గోర్కా నుంచి 65, దాడింగ్ నుంచి 55, త‌న‌హున్ నుంచి 38, ర‌సువా నుంచి 27 మందిని వెలికితీశారు. నేపాల్‌లో సంభ‌వించిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 8 జిల్లాలు అత‌లాకుత‌లమయ్యాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్