శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గాజాలో ఇజ్రాయెల్ దాడిలో మరణించిన పాలస్తీనా పాత్రికేయురాలికి రోరీ పెక్ అవార్డు

1 రోజు క్రితం

గాజాలో ఇజ్రాయెల్ దాడిలో మరణించిన పాలస్తీనా పాత్రికేయురాలికి రోరీ పెక్ అవార్డు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 10:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్:

గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరణించిన పాలస్తీనా యుద్ధ విలేఖరి మరియం దగ్గాకు ప్రతిష్ఠాత్మక రోరీ పెక్ అవార్డును మరణానంతరం ప్రకటించారు. పాలస్తీనాలో యుద్ధం కారణంగా మానవ జీవితాలపై పడిన తీవ్ర ప్రభావాన్ని ప్రపంచం ముందుకు బలంగా తీసుకువచ్చినందుకు ఆమెకు ఈ పురస్కారం లభించిందని రోరీ పెక్ ట్రస్ట్ వెల్లడించింది.


2025 ఆగస్టులో దక్షిణ గాజాలోని నాసర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 33 ఏళ్ల మరియం దగ్గా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు పాత్రికేయులు కూడా మృతి చెందారు. ఫ్రీలాన్స్ వీడియో జర్నలిస్టులకు అందించే ఈ అవార్డును అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) సహచరులు అబ్దుల్ కరీం హనా, జిహాద్ అల్షరాఫీలతో కలిసి మరియం పంచుకున్నారు.


2023 అక్టోబర్‌లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అసోసియేటెడ్ ప్రెస్‌తో కలిసి స్వతంత్ర ఫోటోగ్రాఫర్‌గా, రిపోర్టర్‌గా మరియం పనిచేశారు.


ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిజాలను ప్రపంచానికి తెలియజేయడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని అసోసియేటెడ్ ప్రెస్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ జూలీ పేస్ అన్నారు. మరియంను, ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన ఇతర పాత్రికేయులను స్మరించుకుంటున్నామని, వారి మరణాలకు బాధ్యులైన వారిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్