ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అక్రమ జూద రాకెట్‌లో భారతీయ మూలాల రాజకీయ నేత

2 గంటల క్రితం

Anand Shah, a politician of Indian origin in New Jersey, USA.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమెరికా : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భారతీయ మూలాల రాజకీయ నాయకుడు ఆనంద్‌ షా తాను అక్రమ జూద రాకెట్‌లో భాగస్వామిగా ఉన్నట్లు అంగీకరించారు. రాకెటరింగ్‌, మనీ లాండరింగ్‌ తదితర అక్రమ కార్యకలాపాల్లో ఆయన ప్రమేయం బయటపడటంతో భవిష్యత్తులో ఎలాంటి ప్రజాపదవులు చేపట్టకుండా అధికారులు నిషేధం విధించారు. ఇటాలియన్‌-అమెరికన్‌ నేర ముఠాలతో సంబంధాలు కలిగిన ఆనంద్‌ షా అక్రమ జూద వ్యవహారాల్లో స్పోర్ట్స్‌ బుక్‌ ఏజెంట్‌గా, పోకర్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో సుమారు 9 లక్షల డాలర్లకు పైగా సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది. ఇందులో కొంత మొత్తాన్ని రాజకీయ ప్రచారానికి వినియోగించినట్లు కూడా వెల్లడయ్యింది. ఆయన నేరాలకు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసెంబర్‌ 4న పూర్తి స్థాయి శిక్షను ఖరారు చేయనున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్